Yash - KGF- Chapter 2కథలో కంటెంట్.. హీరోయిజం ఉంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో నిరూపించింది మొన్న ఆ మధ్య విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్‌ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన అన్ని భాషలలోనూ సినిమా సక్సెస్ అయ్యింది.

ఈ క్రమంలో సినిమా రెండో భాగం కూడా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దానికి రెస్పాన్స్ అదిరిపోయింది. ఇది ఇలా ఉండగా సినిమా చిత్రీకరణ పూర్తి కాబోతుంది. అయితే చిత్రం విడుదల తేదీ మీద మాత్రం చిత్రబృందం ఒక నిర్ణయానికి రాలేకపోతుంది.

మొదట ఈ సినిమాని వేసవిలో విడుదల చెయ్యాలని అనుకున్నారు. ఆ తరువాత జులై 30న అనుకున్నారు. తాజాగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అనుకుంటున్నారట. అక్టోబర్ 2న సినిమా అంటే సోలో రిలీజ్ దొరికే అవకాశం లేదు. పైగా కేజీఎఫ్ 2 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కావాల్సి ఉంది.

య‌శ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్‌లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. కోలార్ గోల్డ్ మైన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన సూర్యవర్ధన్ బ్రదర్ గా సంజు బాబా కనిపించబోతున్నాడు. మొన్న ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో “ఒకసారి కేజీఎఫ్ 2 తెర మీద చూశాకా కేజీఎఫ్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది,” యష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.