yarlagadda venkata rao against Vallabhaneni Vamsi into YSRCPతెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. దీనితో దీపావళి తరువాత వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. వంశీని దగ్గరుండి మరీ ఇద్దరు మంత్రులు సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డితో భేటీ జరిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

అయితే వంశీ చేరిక తరువాత ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. వంశీ చేరికను యార్లగడ్డ, వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై సోమవారం నాడు సీఎంను కలవబోతున్నారు యార్లగడ్డ. దీనితో ఆయనకు సీఎం ఏమని భరోసా ఇస్తారో చూడాల్సి ఉంది.

జగన్‌ న్యాయం చేస్తారనే విశ్వాసం నాకుంది. అభిమానుల మనోభావాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కచ్చితంగా నాకు అనుకూలంగానే నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాను’ అని యార్లగడ్డ చెప్పుకొచ్చారు. వంశీ రాజీనామాతో వచ్చే ఉపఎన్నికలో యార్లగడ్డకే టిక్కెటు ఇచ్చి, వంశీని ఎమ్మెల్సీ గానో లేక రాజ్యసభ ఎంపీ గానో పంపాలని జగన్ అనుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

జగన్‌ న్యాయం చేస్తారనే విశ్వాసం నాకుంది. అభిమానుల మనోభావాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కచ్చితంగా నాకు అనుకూలంగానే నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాను’ అని యార్లగడ్డ చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా వంశీ వెళ్ళిపోతే వచ్చే ఉపఎన్నికలో ఎవరిని నిలబెట్టాలనే దానిపై టీడీపీలో ఇప్పటికే చర్చ మొదలైంది.