Yanamala - Ramakrishnuduమాజీ ఆర్ధిక మంత్రి, మండలిలో ప్రతిపక్ష నాయకుడు, యనమల రామకృష్ణుడు వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రుల మీద తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులు సభలోకి తాగి వచ్చారన్నారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన లోకేష్ ను మంత్రులు కొట్టే ప్రయత్నం చేశారన్నారు. సభలో గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రులు ప్రవర్తించారని చెప్పారు.

అందుకే శాసన మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారని యనమల ఆరోపించారు. ఇది ఇలా ఉండగా మరో టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరో సంచలన ఆరోపణ చేశారు. ‘‘నువ్వు సాయిబుకే పుట్టావా? నీ అంతు చూస్తా’’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఘోరంగా దుర్భాషలాడారు అని చెప్పుకొచ్చారు.

‘‘మంత్రి ఎంత తిడుతున్నా చైర్మన్‌ ఏ ప్రతిస్పందనా వ్యక్తం చేయకుండా ప్రశాంతంగా వింటూ ఉండిపోయారు. ఆ సమయంలో నేను అడ్డుపడి మంత్రిని కొంత వెనక్కు నెట్టాను. మేం లేకపోతే చైౖర్మన్‌పై మంత్రి దాడి చేసేవారేమోనని అనిపించింది. ఇంతలో భద్రతా సిబ్బంది వచ్చి చైర్మన్‌ను కార్లో ఎక్కించి పంపారు’’ అని చెప్పారు.

మరోవైపు శాసనమండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుకి నిరసనగా నేటి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. శాసనసభకు హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇది ఇలా ఉండగా శాసనమండలిలో నిన్న జరిగిన పరిణమాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం తాడేపల్లి నివాసంలో సీఎం జగన్‌తో విజయసాయిరెడ్డి మంతనాలు జరిపారు. న్యాయ, రాజ్యాంగపరమైన అంశాలపై సీఎం జగన్‌ చర్చించినట్లు తెలుస్తోంది.