Will ys jagan get the victory in 2019 electionsనిన్న చివరి దశ సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావడంతో చాలా టీవీ ఛానల్స్ తమ అంచనాలు ఎగ్జిట్ పోల్ సర్వేల రూపంలో ప్రకటించాయి. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో మరోసారి సందిగ్దత కనిపించింది. గత ఎన్నికలు లాగానే టీడీపీ అని కొందరు, వైఎస్సార్ కాంగ్రెస్ అని కొందరు చెప్పుకొచ్చారు. ఎక్కువగా సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపుకే మొగ్గు చూపడం విశేషం. లగడపాటి, టుడేస్ చాణక్య వంటి మంచి ట్రాక్ రికార్డు కలిగిన సంస్థలు టీడీపీ వైపు నిలిచాయి.

ఈ ఎన్నికలలో విజయం కోసం జగన్ ఏడాదిన్నర పాటు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. గతంలో పాదయాత్రలు చేసి వైఎస్ రాజశేఖరరెడ్డి (2004), చంద్రబాబు నాయుడు (2014) అధికారంలోకి వచ్చారు. అయితే వారిద్దరి కంటే జగన్ ఎక్కువ మేర పాదయాత్ర చేశారు. ఎక్కువ రోజులు ప్రజల మధ్యలో ఉన్నారు. గతంలో ఉన్న సెంటిమెంట్ ప్రకారం తమ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ క్యాడర్ ధీమాగా ఉన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు చాలా కీలకం. కొత్తగా పుట్టిన ఒక ప్రాంతీయ పార్టీ రెండు సార్లు వరుసగా ప్రతిపక్షంలో మనగలగడం దాదాపు అసంభవం అనే చెప్పుకోవాలి. పై పెచ్చు ఈ సారి ఓడిపోతే చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ ను పూర్తిగా తుడిచిపెట్టేసే ప్రయత్నం చేస్తారు. పార్టీని కాపాడుకుని అధికారంలోకి రావాలన్న జగన్ కల నిజం కావాలి అంటే ఈ సారి తాను చేసిన పాదయాత్ర ఫలితాన్ని ఇవ్వాలి. ప్రజా తీర్పు ఎటువైపు ఉందొ తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.