MLA Kotamreddy Sridhar Reddyవైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రతిపక్షంలో టీడీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడిన వారిలో ముందు ఉంటారు కోటంరెడ్డి. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చిన వివాదాల వల్ల జగన్ ఆయనకు పక్కన పెట్టారా అనే ఊహాగాలను వస్తున్నాయి.

జిల్లాలోని కొందరు సీనియర్ నాయకులతో కూడా ఆయనకు పొసగడం లేదు. ఈ అనుమానం ఆయనకు కూడా వచ్చినట్టు ఉంది. తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో రకంగా పోరాడి మైక్ తెచ్చుకునేవాడినని, కాని అదికారంలోకి వచ్చిన గత ఎనిమిది నెలలుగా తనకు సరిగా మైక్ రావడం లేదని ఆయన వాపోయారు.

చీఫ్ విప్ శ్రీకాంతరెడ్డి కూడా తన పేరును మాట్లాడడానికి జాబితాలో ఇవ్వడం లేదని, చేయి లేపుతున్నా స్పీకర్ గారు కూడా చూడడం లేదని, కారణం తెలియడం లేదని అన్నారు. గతంలో టిడిపి వారు జగన్ ను ఉద్దేశించి నోటికి వచ్చినట్లు మాట్లాడేవారని అన్నారు.

అచ్చెన్నాయుడు నువ్వు మగాడివేనా అంటూ దూషణలకు దిగేవారని, ఇంకొకరు నీలో రాయలసీమ రక్తం ఉందా అని సవాల్ చేసేవారని, వీటన్నటిని భరించలేకపోయేవారమని, నేను ఒకసారి ఖబడ్దార్ అని చంద్రబాబు ను ఉద్దేశించి అంటే మా పార్టీ నేతే నన్ను వారించారని ఆయన అన్నారు. తాను ఎన్నికవడానికి ముగ్గురు కారకులు అని ముఖ్యమంత్రి జగన్ కార్యకర్తలు,ప్రజలు అని ఆయన అన్నారు. మరి కోటంరెడ్డి మొర ముఖ్యమంత్రి జగన్ ఆలకిస్తారో లేదో చూడాలి.