YS Jagan planning to off international flights from Gannavaram Airportగన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డిచే ఏకైక అంతర్జాతీయ సర్వీసు సింగపూర్‌కు నడుస్తున్న ఇండిగో విమానం మాత్రమే. విమానయాన సంస్థ జూన్‌ నెలాఖరు వరకే టిక్కెట్ల విక్రయాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌)తో ఇండిగో చేసుకున్న ఒప్పందం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఈ సర్వీసు వల్ల నష్టం వస్తే పూడ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) చేస్తుంది.

65శాతంకంటే తక్కువ టిక్కెట్లు విక్రయమైతే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా ఒప్పందం కుదిరింది. వారంలో మంగళ, గురువారాలు రెండు రోజులు సింగపూర్‌- విజయవాడ, విజయవాడ- సింగపూర్‌ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే అప్పట్లో దీనిని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. కొత్త ప్రభుత్వం దీనిని కొనసాగించదు అనే అనుమానాలతో విమానయాన సంస్థ జూన్‌ నెలాఖరు వరకే టిక్కెట్ల విక్రయాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.

ఇండిగో సంస్థ 180 సీటింగ్‌ సామర్థ్యం ఉన్న ఏ320 ఎయిర్‌బస్‌లను నడుపుతోంది. గత ఆరు నెలల్లో ఫిబ్రవరి, మార్చిలో తప్ప మిగతా రోజుల్లో చాలావరకూ 70 నుంచి 95శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) నమోదవుతోంది. ఇటువంటి సమయంలో ఒప్పందం రద్దు చేసుకుంటే గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ సర్వీసులే లేకుండాపోతాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో ఈగో పక్కన పెట్టి విజ్ఞతతో నిర్ణయం తీసుకుంటే మంచిది.