KCR -D-Srinivas Raoటీఆర్‌ఎస్ పార్టీ తనపై కక్ష కట్టిందని డీ.శ్రీనివాస్ ఆరోపిస్తూ బహిరంగ లేఖ రాశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డానన్న ఆరోపణలు బాధ కలిగించిందని, తాను ఎలాంటి తప్పు చేయకున్నా సస్పెండ్ చేయాలని సీఎం కేసీఆర్‌కు తీర్మానం పంపారని ఆయన ఆరోపించారు. తన కుమారుడు అరవింద్ బీజేపీలో చేరతాడని కేసీఆర్‌కు ముందే చెప్పానని, బీజేపీలోకి వెళ్లాలని తన అనుచరులకు ఎప్పుడూ చెప్పలేదని లేఖలో తెలిపారు.

సంజయ్ విషయంలో ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించిందని తన మీద కక్షతో అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆయన అన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచానని చెప్పారు. తనను రాజకీయంగా దెబ్బ తీయడమే కాకుండా, తన కుటుంబాన్ని రోడ్డుకీడ్చారంటూ డి.శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు.

తాను పార్టీకి రాజీనామా చేయ్యనని కావాలంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని ఆయన సవాలు విసిరారు. ఎన్నికల వేళ బీసీ నేతైన తనను సస్పెండ్ చేసే సాహసం కేసీఆర్ చేయ్యరని డీఎస్ ధీమా కావొచ్చు. తాను టీఆర్‌ఎస్‌లో ఉండటం కవితకు, జిల్లా నేతలకు ఇష్టం లేకపోతే సస్పెండ్ చేయండని…సస్పెండ్ చేయడం చేతకాకపోతే తీర్మానం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.