Will TJAC  Kodandaram Reddy tackle with KCRతెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఆద్వర్యంలో జరిగిన కొలువుల కొట్లాట సభకు యువత పెద్ద ఎత్తున వచ్చారు. ఆంక్షలకు ఆకాంక్షలు తలొంచవని, తెలంగాణ సాధించుకున్నట్టుగానే ఉద్యోగాలను కూడా సాధించుకోవాలన్న ఆకాంక్షలు యువతలో బలంగా ఉన్నాయని కోదండరామ్ వ్యాఖ్యానించారు.

హై కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికీ గవర్నమెంట్ యంత్రాగం అడుగడుగునా సభకు అడ్డు పడింది. అయినా యువత పెద్ద సంఖ్యలో హాజరు కావడం చెప్పుకోదగ్గ విషయమే. “కాంట్రాక్టులు ఇప్పించి కమీషన్లు తీసుకోవడంపై దృష్టిపెడుతున్నారని. భూముల్ని ఎవరికి కట్టబెడదామా ఇసుక కాంట్రాక్టులు ఎవరికి ఇప్పించుకుందామా అన్నవే ముఖ్యమంత్రికి ప్రధానమయ్యాయరిని” కోదండరామ్ మండిపడ్డారు.

కాంట్రాక్లర్ల మేలు కోసమే నిరుద్యోగుల జీవితాలను బలి పెడుతున్నారు. నిరుద్యోగుల సమస్య ఈ ప్రభుత్వానికి అప్రధానమైపోయింది అని ఆయన విమర్శించారు. విపక్షాలు, మేధావులు హాజరైన ఈ సభ సక్సెసైనా ప్రజలకు ఆ విషయం చేరకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. అన్ని ప్రధాన మీడియా ఛానళ్ళు అసలు అలాంటి కార్యక్రమం ఏది జరగనట్టే వ్యవహరించాయి.

నిరుద్యోగులను రాజకీఆయాల కోసం రెచ్చగొడుతున్నారని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కాంగ్రెస్ ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. మొత్తం విపక్షాన్ని ఒకతాటి పై తెచ్చిన కోదండరామ్ రాజకీయ మేరుపర్వతం లాంటి కేసీఆర్ ను ఎదురుకోగలరా అనేది చూడాలి!