Telangana - Congress Mass Resignationఅసెంబ్లీలో తమ సభ్యులు ఇద్దరి సభ్యత్వాలు రద్దు చెయ్యడం, 11 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్లతో తెలంగాణ ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ తీరుకి నిరసనగా ముకుమ్మడి రాజీనామాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

దీనికి ఏఐసీసీ అనుమతి కోరనున్న సీఎల్పీ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇది మాములు బెదిరింపు చర్యో లేదా నిజంగా వారు రాజీనామాలు చేస్తారో చూడాలి. రాజీనామాలు చేశాక ఉపఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటో కూడా చూడాలి. కాంగ్రెస్ ఇప్పటికే రేవంత్ రెడ్డి లాంటి గట్టి నేతను కూడా రాజీనామా చేయించలేదు.

సాంకేతిక అంశాలు అడ్డుపెట్టుకుని రాజీనామాను పక్కన పెట్టారు. నిజంగా ఉపఎన్నికలు వస్తే తెరాస ప్రభుత్వం తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. వ్యతిరేక ఫలితాలు వస్తే 2019 ఎన్నికలలో కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. దీనితో మూకుమ్మడి రాజీనామాలు అనేవి అంత తేలిక అయితే కాదు.