will Sukumar fall into that moldకొన్ని సినిమాలు చూస్తే గతంలో వచ్చిన కథలు , సన్నివేశాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా దర్శకులు ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే దాని మీద బేస్ అయి అవే మూస ధోరణిలో తీస్తూ బండి లాగిస్తుంటారు.

ప్రస్తుతం ‘పుష్ప(ది రైజ్) ‘ ప్రమోషనల్ స్టఫ్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. రామ్ చరణ్ తో సుకుమార్ ఉహించని విధంగా ‘రంగస్థలం’ అంటూ నేచురల్ రివేంజ్ డ్రామాతో పీరియాడిక్ తీసి నాన్ బాహుబలి రికార్డు కొట్టేశాడు. అప్పటి వరకు చరణ్ ని ఎవరూ చూడని విధంగా చూపించడం, క్యారెక్టర్స్ క్లిక్ అవ్వడం, డ్రామా వర్కౌట్ అవ్వడంతో అది రికార్డులు సృష్టించింది.

ఇప్పుడు ‘పుష్ప’ విషయంలో కూడా సుకుమార్ అదే రిపీట్ చేస్తున్నాడా ? అదే మూసలో వెళ్తున్నాడా ?అనే అనుమానాలు మొదలయ్యాయి. దీనికి అనేక కారణాలున్నాయి. ముందుగా బన్నీ లుక్. ‘రంగస్థలం’ తో చరణ్ ని కొత్త లుక్ లో చూపించిన సుక్కు ఇప్పుడు బన్నీ లుక్ కూడా ఇంచు మించు అలాగే డిజైన్ చేశాడు. కాకపోతే అక్కడ చరణ్ లుంగీ కడితే ఇక్కడ బన్నీ ప్యాంట్ వేసాడు అంతే. షర్ట్స్ ఒకేలా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే క్యారెక్టర్స్, సాంగ్స్ కూడా ఆ సినిమానే గుర్తుచేస్తున్నాయి.

ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ‘రంగస్థలం’ కి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ఇప్పుడు ‘పుష్ప’ పాటలు అదే కోవలో ఉన్నాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ‘రంగస్థలం’ ఒక ఊరి కథ. కానీ ‘పుష్ప’ ఓ అడవి కథ. పైగా ఎర్ర చందనం అనే ఎలిమెంట్ ఉంది. సో కథ -కథనం పరంగా రెండింటికీ చాలానే తేడా ఉంటుందనుకోవచ్చు. ఏదేమైనా తన బ్రిలియంట్ మేకింగ్ తో టాప్ లిస్ట్ లో కొనసాగుతున్న లెక్కల మాస్టర్ మూస వైపు వెళ్లకపోతే బెటర్.