Shoban Babu - Biopicలెజెండరీ యాక్టర్ శోభన్ బాబు బయోపిక్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని…. రానా దగ్గుబాటి ఇందులో నటించే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, అటువంటి బయోపిక్ అంటూ జరిగితే పని అవుతుందా అనేదాని మీద మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి.

“ఏదైనా బయోపిక్ పనిచేయాలంటే, ప్రేక్షకులను కథ లో లీనం చేయడానికి ఒక కాంఫ్లిక్ట్ పాయింట్ అవసరం. శోభన్ బాబు జీవితంలో అటువంటివి ఏమీ ఉండవు. ఆయన కెరీర్ లోని చివరి రోజులలో కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ పడలేదు. కాబట్టి, అది పని చేయకపోవచ్చు” అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

శోభన్ బాబు తన ప్రైమ్ ను దాటిన తరువాత అకస్మాత్తుగా పరిశ్రమ నుండి ఎందుకు వైదొలిగారు? ఎందుకు ఆ తరువాత ఎక్కడా కనిపించలేదు అని ప్రేక్షకులలో ఒక ఉత్సుకత ఉంది. అయితే ఆ పాయింట్ మీద సినిమా సక్సెస్ అవుతుందా అంటే అనుమానమే. ఇదంతా పక్కన పెడితే ఈ వార్త నిజమా కాదా అనేది కూడా చూడాలి.

ఇది ఇలా ఉండగా… లాక్డౌన్ కారణంగా రానా యొక్క రెండు చిత్రాలు ప్రభావితమయ్యాయి. అతని రెడీ ఫర్ రిలీజ్ చిత్రం, హాతి మేరే సాతి నిరవధికంగా వాయిదా పడింది. అతని మరొక చిత్రం విరాటపర్వం ఒక పది రోజుల షూట్ చేస్తే పూర్తి అయ్యే సమయంలో కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. రానా నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టొచ్చు అంటున్నారు.