will Ram Charan performance continues after Rangasthalam‘చిరుత’తో మొదలుపెట్టిన రామ్ చరణ్ సినీ ప్రస్థానంలో… మొదటిసారిగా తన యాక్టింగ్ గురించి మాట్లాడేలా చేసాడు చిట్టిబాబు. ఈ పాత్రలో ఒక్క రామ్ చరణ్ ను తప్ప మరే హీరోను ఊహించుకోవడానికి అవకాశం లేకుండా సిల్వర్ స్క్రీన్ పై చెలరేగిపోయాడు. ఒక పరిపూర్ణ నటుడు చెర్రీ నుండి బయటకు వచ్చాడా? అనే విధంగా విమర్శకులను కూడా ఆశ్చర్యపరిచాడు చిట్టిబాబు.

దీంతో చెర్రీ నటనపై భవిష్యత్తులో విమర్శలు వినిపించవా? చిట్టిబాబు లాగానే ప్రతి క్యారెక్టర్ లో జీవించేస్తాడా? ఇలాంటి ప్రశ్నలే చెర్రీకి గడ్డుకాలం ముందుందని సూచిస్తున్నాయి. చిట్టిబాబు పాత్రలో మెస్మరైజ్ చేసిన చెర్రీ ఇతర పాత్రలలో కూడా ఇంతే స్థాయిలో అలరిస్తాడా? అనేది రామ్ చరణ్ ఇంకా నిరూపించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ‘చిట్టిబాబు’ తరహా పాత్రలు దశాబ్దానికి ఒకటి వస్తుంటాయి.

చిట్టిబాబు ఆకారం, శరీరాకృతి… రొటీన్ తెలుగు సినిమాలలో చూసేది కాదు. గడ్డంతో కూడిన చెర్రీ లుక్ కూడా ఇతర పాత్రలకు సెట్ అయ్యేది కాదు. ఇదే రామ్ చరణ్ కు ఛాలెంజింగ్ గా మారిన అంశం. మున్ముందు ప్రేక్షకులు కూడా చెర్రీ యాక్టింగ్ గురించి మాట్లాడుకునేలా చేసిన చిట్టిబాబు, దానిని కొనసాగించగలరా? అనేది తెలియాలంటే ఈ ఏడాది సెకండాఫ్ లో రాబోతోన్న బోయపాటి సినిమా వరకు వెయిట్ చేయాల్సిందే.