will Paritala Sriram continue the paritala ravi legacyరాయలసీమలో బాగా ఆసక్తి కలిగించే పోటీలలో ఒకటి రాప్తాడు నియోజకవర్గం. మంత్రిగా ఉన్న పరిటాల సునీత తప్పుకుని తన కుమారుడు శ్రీరామ్ ను రాజకీయాలలోకి తీసుకుని వచ్చారు. శ్రీ రామ్ రాజకీయాలలో రాణిస్తాడా అనేది జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పరిటాల వర్గం పరిటాల వారసత్వాన్ని ఎలాగైనా గెలిపించుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. తోపుదుర్తి సోదరుల చేతికి అధికారం వెళ్తే ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళి మొదలు అవుతాయని స్థానిక ప్రజలలో ఉంది.

దానితో పాటు సునీత మంత్రిగా ఉండడంతో సంక్షేమ ఫలాలు బాగా అందేలా చర్యలు తీసుకున్నారు. పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తూండటంతో యువత కూడా.. మద్దతుగా నిలుస్తోంది. కొత్త ఓటర్లు కూడా ఆయనతో నిలుస్తున్నారు. సునీతమ్మ గెలుస్తే కొంత మేర కష్టం అయ్యే పరిస్థితులు ఉండేవని శ్రీరామ్ పోటీ చెయ్యడంతో టీడీపీకి అనుకూలంగా మారిందని స్థానికుల మాట. అయితే ఎన్నికల రోజు టీడీపీకి పట్టు ఉన్న గ్రామాల్లో పోలింగ్ తగ్గించేందుకు.. తోపుదుర్తి బ్రదర్స్ పావులు కదుపుతున్నారు.

దీనితో పోలింగ్ రోజు పరిణామాలు చాలా కీలకం కాబోతున్నాయి. వరుసగా పోటీ చేసి ఓడిపోవడంతో కొంత మేర తన మీద సానుభూతి ఉంటుందని ప్రకాష్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఉన్న పరిస్థితుల బట్టి పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే కావడం ఖాయంగా కనిపిస్తుంది. పరిటాల వర్గీయులు అప్పుడే మెజారిటీ మీద బెట్టింగులకు దిగుతున్నారు. మరి చివరి నిముషంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏమైనా సంచలనం సృష్టించగలరేమో చూడాల్సి ఉంది.