will nani tuck jagadish movie release in OTTనేచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబు యొక్క వీ కోవిడ్ ఫస్ట్ వేవ్ లో తెలుగులో డైరెక్టు గా ఓటీటీలో విడుదలైన పెద్ద సినిమా. మిగతా పెద్ద హీరోలు ఎవరు థియేటర్లలో విడుదల చెయ్యకుండా ఓటీటీకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో, ఈ నెలలో విడుదల కావాల్సిన నాని యొక్క మరో చిత్రం టక్ జగదీష్ చివరి నిమిషంలో వాయిదా పడింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు – అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీ విడుదల కోసం టక్ జగదీష్‌కు పెద్ద ఆఫర్‌లను ఇచ్చాయని నివేదికలు వస్తున్నాయి. ఈ ఆఫర్లు నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టేవిగా ఉన్నాయట. కానీ తమకు అటువంటి ఆలోచన లేదని తిరస్కరించారట.

మొదటి సారీ, ఇప్పుడు కూడా నానికే ఇలా జరగడం గమనార్హం. టాలీవుడ్ మేకర్స్ త్వరలోనే విషయాలు సాధారణమవుతాయని ఆశిస్తూ… పెద్ద చిత్రాల కోసం ఒటిటి మళ్లడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. మరొక వైపు, అర డజను చిన్న సినిమాలు ఓటీటీ విడుదల కోసం వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్లతో చర్చలు జరుపుతున్నాయి.

వచ్చే నెలాఖరుకు కూడా పరిస్థితి చక్కబడకపోతే ఒకదాని తరువాత ఒకటి అధికారిక ప్రకటనలు వస్తాయి. అయితే పెద్ద సినిమాలు మాత్రం ఇప్పట్లో ఓటీటీ వైపు చూడాలని ఆలోచన చేసే అవకాశం లేదనే అంటున్నారు. చూడాలి మునుముందు పరిస్థితి ఎలా ఉండబోతుందో!