will Lakshmis NTR get censor clearanceవివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ 10 మిలియన్ వ్యూలు నమోదు చేసింది. 1989 ఎన్నికలలో ఎన్టీఆర్‌ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అది టీడీపీలో ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అనేదే ఈ సినిమా.

ఈ సినిమాని మార్చి 15న రిలీజ్ చేయాల‌నేది ప్లాన్‌. ఆ టైమ్‌కి ఎన్నిక‌ల కోడ్ కూడా వ‌స్తుంది. మ‌రి ఎన్నిక‌ల టైమ్‌లోరిలీజ్‌కి ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ప‌ర్మిష‌న్ కావాల్సి ఉంటుంది. అయితే దీనికంటే ముందు అసలు సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎటువంటి క‌ట్స్ లేకుండా ఇది సెన్సార్ కావ‌డం అంత ఈజీ కాదు. యాత్రలో కానీ, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు కానీ…డైర‌క్ట్‌గా ఏ పార్టీపైన కానీ, ఏ నాయ‌కుడిపైన కానీ అభ్యంత‌ర‌క‌ర ప‌దాలు, మాట‌లు వాడ‌లేదు.

కాంగ్రెస్ అధిష్టాన్ని , నాదెండ్ల‌ని నెగిటివ్‌గా చూపించారు కానీ ఎక్కడా బోర్డ‌ర్ దాట‌లేదు. అయితే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అలా కాదు. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు విల‌న్‌. నా జీవితంలో చేసిన ఏకైక త‌ప్పు వాడిని న‌మ్మ‌డ‌మే అని ఎన్టీఆర్ బాబుని ఉద్దేశించి చెప్పే డైలాగ్ ట్ర‌యిల‌ర్‌లో చూశాం. అటువంటి డైలాగ్‌లు సినిమాలో చాలా ఉన్నాయ‌ట‌. వాటిని సెన్సార్ బోర్డు అనుమ‌తిస్తుందా? క‌ట్ చెపుతుందా? అసలు సినిమా రిలీజ్ అవుతుందా? సెన్సార్ ప‌రంగానూ, ఎన్నిక‌ల సంఘంతోనూ వ‌ర్మ చిక్కులు మధ్య సినిమా విడుదల అవుతుందో లేదో చూడాలి.