Koratala-Siva will be another Rajamouliటాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకులు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది ఎస్.ఎస్.రాజమౌళి పేరే. అయితే ఆ ఒరవడిని కొనసాగిస్తున్న మరో దర్శకుడు కొరటాల శివ. “మిర్చి” సినిమాతో ప్రారంభం అయిన కొరటాల విజయాల పరంపర “భరత్ అనే నేను” వరకు నిరంతరాయంగా కొనసాగుతోంది.

2018లో విడుదలైన ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవిని – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లను కలుపుతూ “ఆచార్య” సినిమాను ప్రకటించిన కొరటాల శివ, కరోనా కారణంతో అనేక వాయిదాలు వేస్తూ ఎట్టకేలకు ఈ నెల 29వ తేదీకి రిలీజ్ ను ప్రకటించారు.

నాలుగేళ్ల పాటు సాగిన “ఆచార్య” ప్రయాణం తుది దశకు చేరుకుంది. మంగళవారం నాడు “ఆచార్య”కు సంబంధించిన కీలకమైన ప్రమోషన్ మెటీరియల్ రిలీజ్ కాబోతోంది. ఏ సినిమా హైప్ కైనా ధియేటిరికల్ ట్రైలర్ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ప్రస్తుతం సినీ ప్రేమికులలో “ఆచార్య” ట్రైలర్ ఎలా ఉండబోతోందా? అన్న ఆసక్తి నెలకొంది.

రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమాకు కూడా ధియేటిరికల్ ట్రైలర్ విడుదల కాక ముందు, ట్రైలర్ విడుదలైన తర్వాత పరిస్థితి వేరు. అంచనాలకు మించి ఉన్న ట్రైలర్ తో “ఆర్ఆర్ఆర్”పై హైప్ ఆకాశాన్ని తాకాయి. “ఆచార్య” అంచనాలు రెట్టింపు అవ్వాలన్నా ట్రైలర్ అదిరిపోవాలి.

కొరటాల శివకున్న సక్సెస్ ఫుల్ ట్రాక్ “ఆచార్య”కు బలం కాగా, తొలిసారిగా చిరు – చరణ్ లు కలిసి నటించడం ఈ సినిమాకున్న మరో ప్రధాన బలం. కానీ భారీ ఓపెనింగ్స్ రావాలంటే మాత్రం ‘ట్రైలర్ టాక్’ కేక పుట్టాల్సిందే. మరి ఈ కట్ విషయంలో కొరటాల ఎంతమేర సక్సెస్ సాధించారో తెలియాలంటే మంగళవారం నాడు సాయంత్రం సమయం వరకు వేచిచూడాల్సిందే.

“ఆచార్య” సినిమా చిరు, చరణ్ లకు ఎంత ప్లస్ అవుతుందో తెలియదు గానీ, టాలీవుడ్ లో ఫెయిల్యూర్ తెలియని దర్శకుల జాబితాలో రాజమౌళి తర్వాత కొరటాల శివ పేరు సుస్థిరంగా నిలబడడానికి మాత్రం ఈ “ఆచార్య” ఫలితం ఎంతో కీలకం.