Will Jr NTR Aravindha Sametha join in 3 million club-రెండు రోజుల క్రితం విడుదలైన త్రివిక్రమ్ – తారక్ ల “అరవింద సమేత వీర రాఘవ” సినిమాకు ఓపెనింగ్ డేన బ్రహ్మాండమైన కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. అదే దూకుడును రెండవ రోజు పూర్తిగా కొనసాగించకపోయినప్పటికీ, నైజాం, సీడెడ్ ఏరియాలలో అద్భుతమైన రెవిన్యూ రాబడుతోంది. మిగిలిన ఏరియాలలో పరవాలేదనిపించిన రెండవ రోజు కలెక్షన్స్ ను పక్కన పెడితే, శని, ఆదివారాలలో అందుకోబోయే రెవిన్యూ సినిమా రేంజ్ ను డిసైడ్ చేయనుంది.

ఏపీ, తెలంగాణాలతో పాటు త్రివిక్రమ్ అడ్డాగా భావించే యుఎస్ లోనూ ఈ సినిమా బలంగా ఉంది. ఇప్పటికి ఈ సినిమా యుఎస్ లో 1.26 మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకుంది. ఇక్కడ సినిమా రేంజ్ ను శనివారం నాడు డిసైడ్ కానుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 2 మిలియన్స్ దరిదాపుల్లోకి చేరుతుందని భావిస్తుండగా, అసలు ఏ క్లబ్ లో ల్యాండ్ అవుతుందోనని అంతా ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో ‘రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాలతో చెర్రీ అండ్ మహేష్ లు 3 మిలియన్ క్లబ్ లోకి అడుగుపెట్టారు.

దీంతో ‘అరవింద సమేత’కు కూడా మంచి మౌత్ టాక్ లభిస్తే, 3 మిలియన్స్ సొంతం చేసుకుంటుందని భావించగా, అది ప్రస్తుతం అసాధ్యంగా కనపడుతోంది. ప్రీమియర్స్ తర్వాత కలెక్షన్స్ అంచనాలు వేయలేని విధంగా తగ్గుముఖం పట్టాయి. ఒకవేళ శనివారం నాడు భారీ కలెక్షన్స్ ను సాధించని పక్షంలో 2 మిలియన్స్ కూడా కష్టసాధ్యమేనని పేర్కొనవచ్చు. ఇదే సమయంలో అగ్ర హీరోలు మహేష్, రామ్ చరణ్ లు కాకుండా విజయ్ దేవరకొండ 2 మిలియన్స్ క్లబ్ లో ఎంటర్ అయ్యాడు. దీంతో పరోక్షంగా త్రివిక్రమ్ – తారక్ కాంబోపై ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంది.lion club