will jagan stop amaravati  worksప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివిధ దశలలో ఉన్న అనేక పనులను రాష్ట్రానికి ఉన్న ఆర్ధిక ఇబ్బందుల కారణంగా నిలిపివేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అమరావతి పనులు కూడా ప్రస్తుతానికి నిలిపివెయ్యాలని జగన్ ఆలోచన చేస్తున్నట్టు ఏపీ24×7 ఒక వార్త ప్రసారం చేసింది. రాజధానిలో నిర్మాణం అవుతున్న శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హై కోర్టు పనులు నిలిపివేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

రాష్ట్రం చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నందున ఖర్చులు తగ్గించుకోవాలని, అనవసర ఖర్చులు ఆపాలని ప్రభుత్వం ఆలోచన ఇందులో భాగంగా ప్రస్తుతం పాలన సజావుగా సాగుతుండటంతో శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హై కోర్టు పనులు కొన్ని రోజులు నిలిపి వెయ్యాలని ఆర్ధిక పరిస్థితి కుదుటపడ్డాకా తిరిగి ప్రారంభించుకోవచ్చని జగన్ అభిప్రాయపడుతున్నారట. ఈ విషయంగా కాంట్రాక్టర్లకు అధికారిక సమాచారం ప్రభుత్వం తొందరలోనే ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

వచ్చే నెల 6న జగన్ సీఆర్దీఏ పరిధిలోని అనేక ప్రోజెక్టులపై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం అనంతరం అన్ని ప్రోజెక్టుల ప్రాధాన్యతలను ముఖ్యమంత్రి నిర్ణయించే అవకాశం ఉంది. ఆ వెంటనే అధికారిక ఉత్తరువులు వెలువడవచ్చని తెలుస్తుంది. అయితే జరుగుతున్న పరిణామాలపై అమరావతికి భూములిచ్చిన రాజధాని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధానిని తరలించే అవకాశాలు పుష్కాలంగా కనపడటంతో వారు అయోమయంలో పడుతున్నారు.