Coronavirus-Cess Taxకరోనా ప్రభావంతో ఇప్పటికే నెల రోజులకు పైగా ప్రజలు తమ ఇళ్లకు పరిమితం అయిపోయారు. ఆర్ధిక రంగం పూర్తిగా కుదేలు అయిపోయింది. బిజినెస్లు అన్ని మూతపడటంతో ప్రభుత్వాలకు ఆదాయం లేదు. పైగా కరోనా కంట్రోల్ చర్యల పేరిట ఖర్చులు పెరిగిపోయాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాలు అప్పులతోనే కాలం వెల్లడిస్తున్నాయి.

ఉద్యోగులకు జీతాలు కూడా వాయిదా వేస్తున్నాయి. ఈ సంవత్సరాంతం వరకు ఆర్ధిక మందగమనం ఉండే అవకాశం ఉండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. నాగాలాండ్ ప్రభుత్వం తొలిసారిగా పెట్రోల్, డీజల్ అమ్మకాలపై కరోనా సెస్ అని పన్ను విధించడం మొదలు పెట్టింది. త్వరలో దీనిని మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించే అవకాశం ఉంది.

కేంద్రం ఇప్పటికే పెట్రోలియం ధరలు రికార్డు స్థాయిలో పతనమైనా ఆ మేరకు లాభాన్ని ప్రజలకు బదిలీ చెయ్యకుండా లాభాన్ని జేబులో వేసుకుంటుంది. అదే సమయంలో రాష్ట్రాలకు సాయం చేసే అభిప్రాయంలో కూడా లేదు. ఈ క్రమంలో రాష్ట్రాలు తమ ఖజానా నింపుకోవడానికి ప్రజలపై పన్నులకు సిద్ధం అవుతున్నాయి.

కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం… భారత్ లో కరోనా కేసులు 33,050. మృతుల సంఖ్య 11,00కు చేరువలో ఉంది. ఈ క్రమంలో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా మే 3 తరువాత రెడ్ జోన్లలో తప్ప లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.