Will Chandrababu Naidu tackle with KCR and Narendra Modiఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నేతలపై ఆదాయపన్ను శాఖ దాడులు ఎక్కువ అవుతున్నాయి. పోలింగ్ కు చివరి రోజులలో పార్టీకి డబ్బు అందకుండా చేసే వ్యూహంలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయని సమాచారం. ఈ నెల మొదట్లో కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి కి చెందిన హాస్పిటల్ పై దాడులు చేశారు. నిన్న టీడీపీ మైదుకూరు అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటి మీద దాడి చేశారు. ఆయన ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు.

ఈరోజు ఉదయం టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. నెల రోజుల క్రితమే ఒకసారి కోవెలమూడి సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మళ్లీ ఇవాళ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోవెలమూడి రవీంద్ర గుంటూరులో బలమైన టీడీపీ నేతగా ఉన్నారు. నిన్న పుట్టా సుధాకర్ యాదవ్ మీద దాడి చేసిన సందర్భంగా అధికారులు తమ మీద పై వర్గాల ప్రెషర్ బలంగా ఉందని డైరెక్టుగానే చెప్పడం విశేషం.

అదే విధంగా హైదరాబాద్ లో ఆస్తులు, కంపెనీలు ఉన్న టీడీపీ నేతలపై ఆ రాష్ట్ర పోలీసులు నిఘా పెంచారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీకి ఇక్కడ నుండి డబ్బు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనీఖులు చేసిగానీ వదలడం లేదు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం పన్నిన ఈ పద్మవ్యూహం నుండి చంద్రబాబు బయటపడి రెండో సారి అధికారంలోకి రాగలరా అనేది చూడాలి. అయితే దానికోసం మే 23వరకు ఆగాల్సిందే.