NTR-Biopic-(NTR-Kathanayakudu)-Vs-Ram-Charan's-Vinaya-Vidheya-Rama,-F2---Strengths-&-Weaknessesగత రెండు రోజులుగా సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమాల సెన్సార్లు పూర్తి అయ్యాయి..అందులో ముందుగా బాలయ్య ఎన్ఠీఆర్ బయోపిక్ క్లీన్ “యూ” సర్టిఫికెట్ తో వస్తే చెర్రీ-బోయపాటి వినయ విధేయ రామ, రజనీకాంత్ పెట్టా, మరో పక్క వెంకీ-వరుణ్ తేజ్ ఎఫ్-2 యూ/ఏ తో బయటకువచ్చాయి.

అయితే ఇదిలా ఉంటే ఈ సెన్సార్ పూర్తి అయ్యే వరకూ తెగ టెన్షన్ పడిపోయారు బయ్యర్స్. సినిమా ఎలా ఉంటుందో? అని ఎందుకంటే ఒక పక్క బడా సినిమాలో పోటీ, మరో పక్క భారీ రేట్లకు కొన్నారు. అన్నీ వెరసి సినిమాపై టెన్షన్ పెంచుకున్నారు బయ్యర్స్.

అయితే ఈ క్రమంలోనే ఎన్ఠీఆర్ సినిమాపై పాజిటివ్ టాక్, ఇక వినయ విధేయ రామ ఫ్లాష్ బాక్ సూపర్ అని, పెట్టాలో రజని మార్క్ మ్యానరిజం అదిరిపోయింది అని, ఎఫ్-2 కంప్లీట్ ఫామిలీతో కలసి చూడవచ్చు అని, సెన్సార్ టాక్ వచ్చింది.

ఇక్కడ అర్ధం కానీ విషయం ఏంటి అంటే, సెన్సార్ టీమ్ కి సినిమా నచ్చితే ప్రేక్షకులకు నచ్చినట్లేనా? వారే సినిమా రిజల్ట్ ను చెప్పేస్తారా ? అయినా సెన్సార్ మాటలు పట్టుకుని బయ్యర్స్ సినిమా ఫలితాన్ని ఆస్వాదించడం ఏంటో..సెన్సార్ ఓకే చేసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయా? ఏమో తెలీదు కానీ ఈసారి సెన్సార్ లెక్క ఎంతవరకూ కరెక్ట్ అవుతుందో చూడాలి.