Will Akhil Akkineni go face offఅఖిల్ అక్కినేని తాజా చిత్రం మిస్టర్ మజ్ను బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడింది. మొదటి వారం కేవలం 10.5 కోట్లు మాత్రమే రాబట్టింది. సినిమా మీద పెట్టుబడిలో ఇది 50% కూడా కాదు. నైజాంలో గత నాలుగు రోజులుగా ఈ సినిమా డెఫిషిట్ లో నడుస్తుంది. వారంత సెలవులలో కూడా పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. దీనితో ఈ సినిమా మరో డిసాస్టర్ ఖాతా లో వేసుకున్నట్టే అఖిల్. పైగా ఇది ఆయన మొదటి మూడు సినిమాలలో మూడవ డిసాస్టర్. దీనితో కెరీర్ డోలాయమానంలో పడినట్టు అయ్యింది.

మొదటి రెండు సినిమాలు పోయినప్పుడు అఖిల్ చాలా కాలం బ్రేక్ తీసుకున్నాడు. ఎక్కడా బయట కనిపించే వాడు కాదు. దాదాపుగా ఏడాది పాటు బ్రేక్ తీసుకునే వాడు ప్రతీ సినిమా తరువాత. ఇప్పుడు ఏం చేస్తాడు అనేది చూడాలి. తన తరువాతి ప్రాజెక్టు ఎవరికీ చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. సత్య పినిశెట్టి, శ్రీను వైట్ల, క్రిష్ లాంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. దీంట్లో క్రిష్ తప్ప ఎవరికీ పెద్దగా క్రేజ్ లేదు. వారితో సినిమాలు తీస్తే సినిమా కొనే వాళ్ళు కూడా ఉండరు.

క్రిష్ ఇటీవలే ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నా అందులో దర్శకుడిగా అతను ఫెయిల్ కాలేదు. పైగా క్రిష్ సినిమాలకు ఒక సెట్ ఆడియన్స్ ఎప్పుడూ ఉంటారు. ఉన్న వారిలో క్రిష్ తో పని చేస్తే అఖిల్ సేఫ్ సైడ్ లో ఉంటాడు. పైగా ఈ సినిమా అంటూ జరిగితే అది నాగార్జునే నిర్మిస్తాడు అని వార్తలు వస్తున్నాయి. దీనితో ఇది అన్ని రకాలుగానూ కలిసి వచ్చే ప్రాజెక్టు అని అక్కినేని అభిమానుల అభిప్రాయం. చూడాలి మరి దీనిపై అఖిల్ వెంటనే నిర్ణయం తీసుకుంటాడో లేక సమయం తీసుకుంటాడో

42 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ తో కెరీర్ మొదలు పెట్టిన అఖిల్ రెండవ చిత్రం హలో కు 32 కోట్లకు పడిపోయింది. ఇప్పుడు తాజాగా మిస్టర్ మజ్ను 24 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. దానిని కూడా రాబట్టలేకపోతున్నాడు అఖిల్. ఈ క్రమంలో వచ్చే సినిమా క్రేజీ ప్రాజెక్టు కాకపోతే అది ఇంకాస్త దిగజారే పరిస్థితి ఉంది. స్టార్ హీరో రేంజ్ కి వెళ్తాడనుకున్న అఖిల్ ఈ స్థాయికి పడిపోవడమంటే అది అక్కినేని అనే పేరుకే మచ్చ. దీనితో ఇప్పటికైనా జాగ్రత్త పడితే మంచిది. అఖిల్ కెరీర్ పట్ల నాగార్జున శ్రద్ధ తీసుకోవాలి.