Will Agnyaathavaasi effect Janasena partyనిన్న విడుదలైన పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అజ్ఞాతవాసి మొదటి ఆట నుండి నెగటివ్ టాక్ తో మొదలయ్యి ప్లాప్ దిశగా వెళ్తుంది. దాదాపుగా 100 కోట్ల షేర్ సంపాదిస్తే గానీ ఈ చిత్రం హిట్ అనిపించుకోదు. ఈ అవకాశాలు దాదాపుగా లేవనే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరోవైపు ఈ చిత్రం ఫెయిల్యూర్ జనసేన మీద ప్రభావం చూపిస్తుందా అని అంతా విశ్లేషిస్తున్నారు.

ఈ చిత్రం భారీ హిట్ అయితే జనసేనకు ఊపొస్తుందని అంతా భావించింది వాస్తవమే. ఇప్పుడు ప్లాప్ అయితే ఏంటి సంగతి అని అంతా విశ్లేషిస్తున్నారు. అయితే జనసేన అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ వీటి అన్నిటికి అతీతమని ప్రభావం ఏమి ఉండదని అంటున్నారు.

పైగా గతంలో రాజకీయ అరంగేట్రానికి ముందు తమిళ్ నాడు ఎంజీఆర్ కూడా ఐదు ప్లాపులు ఇచ్చిన సంగతి వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయి రోడ్ ఎక్కితే మాత్రం పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో?