జూనియర్ ఎన్టీఆర్ పై ఎందుకంత ప్రేమ?టిడిపి నేత వర్ల రామయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు మరికొందరు టిడిపి నేతలు వంత పాడడంతో… ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా చలామణి అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది.

దీంతో వైసీపీ నేతలు తెరపైకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పై ఎక్కడ లేని ప్రేమ, ఆప్యాయతలను చూపిస్తూ… సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. నిజానికి తారక్ నేడు ఈ స్థితిలో ఉండడానికి కారణమే వైసీపీ అని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.

నాడు తారక్ మామ వైసీపీలో చేరితే, ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తమ పార్టీలోకి వచ్చేసాడన్న ప్రచారం చేయడంతో, తెలుగుదేశం పార్టీతో ఉన్న దూరం ఇంకాస్త ఎక్కువయ్యింది. ప్రస్తుతం కూడా అదే రకమైన వ్యూహాన్ని అవలంభిస్తున్నట్లుగా కనపడుతోంది.

వర్ల రామయ్య వంటి సాధారణ నేత చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యతనిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ను ఆకుల అక్కున చేర్చుకునే కార్యక్రమంలో భాగంగానే ఈ ప్రేమ పలకరింపులు అన్నది తేటతెల్లం అవుతోంది.

‘దుర్యోధనుడి కౌగిలి’ మాదిరి తమ వైపుకు తిప్పుకోవాలని వైసీపీ చేస్తోన్న రాజకీయ పర్వం తెలియని అమాయకుడు తారక్ కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో, ఎప్పుడు ఎలా స్పందించాలో తారక్ బహుబాగుగా తెలుసన్న భావన ఇండస్ట్రీ వర్గాలు కూడా చెప్తుంటాయి.