why telangana  people like kcr దాదాపుగా ఇరవై మంది తెరాస ఎమ్మెల్యేలను ప్రచారం సందర్భంగా గ్రామాలలో ప్రజలు అడ్డుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సారి ప్రజలు కేసీఆర్ బొమ్మ చూసి ఓటు వేస్తారని ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఏ మాత్రం పని చెయ్యదని అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ నమ్మకం వారికి ఊరికే కలగలేదు.

తెలంగాణ సమాజంపై కేసీఆర్ కుటుంబం ఆ మేరకు ప్రభావం చూపించింది. దీనికి ఉదాహరణ – తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలు బతుకమ్మ, బోనాలను తమ నిఘంటువులో చేర్చేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సుముఖత వ్యక్తం చేసింది. దీని కోసం తెలంగాణ జాగృతి తరపున కవిత చేసిన కృషి.

కవిత విజ్ఞప్తి మేరకు ఈ పదాలను నిఘంటువులో చేర్చాలని నిర్ణయించినట్లు ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు యాజమాన్యం తెలిపింది. దీనికి సంబంధించిన పత్రాన్ని కవితకు పంపించారు. దీనిపై ఎంపీ కవిత ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. హర్షం వ్యక్తం చేశారు. చూడటానికి ఇది పెద్ద విషయంలా అనిపించకపోయినా తెలంగాణ సంస్కృతి కోసం, సంప్రదాయాల కోసం తాము తమ వంతు పని చేస్తున్నట్టుగా కవిత చెప్పగలిగారు. అందుకే కేసీఆర్ కుటుంబం అంటే తెలంగాణ సమాజానికి అందుకే అభిమానమేమో! అందుకే కేసీఆర్ ఫ్యామిలీని ఓన్ చేసుకున్నట్టుగా వేరే పార్టీ నేతలను అక్కడి ప్రజలు ఓన్ చేసుకోలేరని అధికార పార్టీ నేతల ఉద్దేశం.