why-narendra-modi-had-grudge-on-chandrababu-naiduప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ ఎన్డీయే ను వీడిన తరువాత మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు నిన్న. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అందరిని ఆశ్చర్యపరుస్తూ చంద్రబాబు నాయుడుపై ముప్పేట దాడి చేశారు. ఎన్టీఆర్ వెన్నుపోటు నుండి బాప్ బేటా సర్కారు అంటూ ఏవేవో విమర్శలు చేశారు. అవినీతిపరుడని కూడా అన్నారు. తన స్పీచ్ ఆసాంతం చంద్రబాబుని లోకేష్ తండ్రి అంటూ సంబోధించడం విశేషం.

దాదాపుగా మోడీ చంద్రబాబు తన బద్ద శత్రువు అన్నట్టే మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుండి బయటకు వచ్చి ఏడాది కూడా కాకముందే ఇంత పెను మార్పు ఏంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు ఎన్డీయే ప్రభుత్వం నుండి బయటకు వస్తారని మోడీ ఏనాడు అనుకోలేదట. ఆపడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. సరే వెళ్ళిపోయాక ఆయన ఏదో మూడో ఫ్రంట్ అని తిప్పలు పడతాడు. అది ఎలాగూ జరిగే పని కాదు అనుకున్నారు.

2019 ఎన్నికల తరువాత బీజేపీకి అవసరం అయితే ఆయనే తిరిగి వస్తారు అని మోడీ అంచనా వేశారు. అయితే చంద్రబాబు మాత్రం అనూహ్యంగా కాంగ్రెస్ కు దగ్గరగా జరిగారు. టీడీపీ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ కాబట్టి కాంగ్రెస్ పంచన చేరతారని మోడీ అసలు ఊహించలేదు. దానికి తోడు ఆయన కాంగ్రెస్ కు మద్దతు కూడగడుతున్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ రాజకీయనాయకుడు హంగ్ వస్తే ఎంత గానో ఉపయోగపడతారు కాంగ్రెస్ కు. దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు మోడీ. దాని ప్రభావమే నిన్న ఆయన వెళ్లగక్కిన అక్కసు.