Somu Veerraju -ఒకపక్క టీడీపీ పార్లమెంటరి మీటింగ్ లో బీజేపీతో పొత్తు ఉండాలా వద్దా అని చర్చిస్తుంటే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి టీడీపీ గవర్నమెంట్ పై విరుచుకుపడ్డారు. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే నా అజెండా. నాకు సొంత ఎజెండా లేదు. రాష్ట్రంలో రూలింగ్ లేదు.. ట్రేడింగ్ మాత్రమే జరుగుతోంది. రెండెకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? అని ఆయన ప్రశ్నించారు.

“మా పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే అవినీతిపై ఎదురుతిరుగుతున్నాము. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నాంది పలికింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థ పరులకు ఆదాయ వనరులుగా మారాయి. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగింది నిజం కాదా? ప్రధాని మోదీ బొమ్మ వాడడానికి రాష్ట్రం భయపడుతోంది. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి పనుల్లో ప్రధాని పేరు ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించడం లేదు. కరెంటు సమస్యలు తీర్చడానికి 5 వేల కోట్ల రూపాయల నిధులు మోదీ ప్రభుత్వం ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుంది,” అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు ఎప్పుడు ఉండేదేగాని ఈ సందర్భంగా సోము వీర్రాజు ఒక మాట తూలారు. రాష్ట్రంలో ఓ మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్న వారు మీరు అని టీడీపీని ఆరోపించారు. అయితే సోము వీర్రాజు మహానేత అని కీర్తించింది ఎవరిని? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిపై ఉన్న మమకారం అలా బయటపెట్టుకున్నారు అని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. నిజంగా సోము వీర్రాజు వైకాపా ఏజెంటా?