who is with Varun Tej when Car Accident happenedరెండు రోజుల క్రితం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ కారును మరో కారు ఢీ కొట్టింది. అయితే కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో ఈ ప్రమాదంలో ఆయన క్షేమంగా బయటపడ్డారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడ నుండి షూటింగ్‌ నిమిత్తం యాగంటి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన రెండో రోజే వరుణ్ తేజ్ యాగంటిలో వాల్మీకి సినిమా షూటింగ్ మొదలు పెట్టారు.

అయితే ఆ రోజు వరుణ్ తేజ్ తో పాటు కారులో ఇంకొకరు ఉన్నారని తెలుస్తుంది. అది ఎవరు అనేదాని పై ఫిలింనగర్ లో రకరకాల పుకార్లు వ్యాపిస్తున్నాయి. ప్రమాదం తరువాత కారు డ్రైవరు కారులో ఇంకెవరు ఉన్నారని మీడియా అడిగితే నీళ్లు నమిలాడు. ఫ్రెండ్ అని మాత్రమే చెప్పాడు. ఎవరు ఆ ఫ్రెండ్ అని అడిగినా సమాధానం లేదు. ఆ ఫ్రెండ్ ఉన్న కారణంగానే వెంటనే వేరే కారు తెప్పించుకుని వరుణ్ తేజ్ మీడియా వచ్చే లోపే అక్కడ నుండి వెళ్ళిపోయాడట.

ఇది ఇలా ఉండగా వాల్మీకి షూటింగ్ యాగంటిలో జరుగుతుంది. వరుణ్ తేజ్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ కాస్త నెగిటివ్ షేడ్ వున్న రఫ్ క్యారెక్టర్ ను పోషిస్తున్నారు. 14రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకికి తమిళ సినిమా జిగర్తాండ మాతృక. సెప్టెంబర్ 6వ తారీఖున విడుదలకు సిద్ధం చేస్తున్నారు. దర్శకుడితో స్పర్ధల కారణంగా దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ వచ్చి చేరారు. సినిమా విడుదలకు నెలల ముందే సినిమా రెడీ అయిపోతుందట. అయితే ఆగస్టులో బాక్స్ ఆఫీసు వద్ద ఖాళీ లేక సెప్టెంబరులో సినిమా విడుదల చేస్తున్నారు. ముందే షూటింగ్ పూర్తి కానుండడంతో పోస్ట్ ప్రొడక్షన్, పుబ్లిసిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారట