who is missguiding ys jaganఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే ప్రతివాదిగా చేర్చి కేసు వేసిన ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డికి హై కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగ్గిలింది. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని కేసు వేసిన జగన్ కు కోర్టు గట్టిగానే మొట్టికాయలు వేసింది. దాడిలో గాయపడ్డ జగన్‌ను విమానంలో ప్రయాణించేందుకు ఎలా అనుమతించారు? అలా అనుమతించే ముందు మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారా?

దానిని ఎవరు జారీ చేశారు? రక్తపు మరకలు అంటిన జగన్‌ చొక్కాను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అసలు… సిఐఎస్ఎఫ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? వీవీఐపీ లాంజ్‌లో దాడి జరిగితే సిఐఎస్ఎఫ్ ఏం చేస్తోంది? పోలీసులకు జగన్ ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేదు వంటి ప్రశ్నలు అడిగి జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది.

సీఆర్పీసీ సెక్షన్‌ 160 కింద ఏపీ పోలీసులకు జగన్‌ వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు నివేదికను సీల్డ్‌ కవరులో అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తును కోర్టు పర్యవేక్షించడానికి కూడా ఒప్పుకోలేదు. కేసును 13వ తారీఖుకు వాయిదా వేసింది. కోర్టు ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలు బట్టి జగన్ కోరినట్టుగా ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇచ్చే అవకాశం లేనట్టే. ముందు నుండీ కూడా కేసుకు సహకరించకుండా పోలీసుల మీద నమ్మకం లేదంటే కోర్టులు ఉపేక్షించవని న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో రాజకీయంగా చంద్రబాబుని ఇరుకున పెడదాం అనుకున్న జగన్ కు ఇబ్బంది కలిగించే తీర్పు వచ్చే అవకాశం ఉంది. అసలు జగన్ కు ఇలాంటి చెత్త సలహాలు ఇస్తున్నది ఎవరో?