Who - is lisaaపెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నవతరం దర్శకులు సినీ ఇండస్ట్రీలోకి దూసుకొస్తున్నారు. ఆ క్రమంలోనే రాజు విశ్వనాధ్ దర్శకత్వంలో “లీసా” అనే హర్రర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సోమవారం నాడు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయనున్న నేపధ్యంలో… ఓ పజిల్ ను నెటిజన్లకు చిత్ర యూనిట్ వదిలింది.

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో సౌత్ ఇండియాకు చెందిన ఓ టాప్ హీరోయిన్ నటించిందని, ఆమె ఎవరో గెస్ చేయండి అంటూ నెటిజన్ల సిక్స్త్ సెన్స్ కు పరీక్ష పెట్టింది. దీంతో సదరు పోస్టర్ ను చూస్తూ ఎవరికీ తోచిన పేర్లను వారు ప్రస్తావిస్తున్నారు. ఇండియాస్ ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3డి హార్రర్ మూవీగా రూపుదిద్దుకున్న ఈ సినిమా షూటింగ్ ను హీలియం 8కే కెమెరా ద్వారా చిత్రీకరించడం విశేషం. ఇంతకీ ఈ హీరోయిన్ పేరేంటో చెప్పండి చూద్దాం..!