KCR - Mamata Banerjeeతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించిన మూడవ ఫ్రంట్ పురిటి నొప్పులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మద్దత్తు పలికిన జెఎంఎం 48 గంటలు దాటకముందే తాము కాంగ్రెస్ తోనే వెళ్తాము అని ప్రకటించేసింది. మరోవైపు ఫ్రంట్ లో ఆధిపత్యపోరు నడుస్తుందని జాతీయ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మూడో ప్రంట్ కు ఎవరు నాయకత్వం వహిస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆరా?లేక పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీనా?అన్న చర్చ ఆరంభం అయిందని ఒక ఆంగ్ల పత్రిక కధనం ఇచ్చింది. ఫ్రంట్ ప్రతిపాదన మొదట చేసింది కేసీఆర్ అయినప్పటికీ దానికి నాయకత్వం వహించడానికి మమత ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.

మమత కేసీఆర్ కు ఫోన్ చేసి మద్దత్తు పలికారు అని ముఖ్యమంత్రి ఆఫీసు నుండి మీడియాకు లీకులు వచ్చినా, నిజానికి ఆయనే మమతకు ఫోన్ చేసి అడిగారని కలకత్తా పత్రికలు రాశాయి. అటువంటి లీకుల వల్ల మమత నోచుకున్నట్టు సమాచారం. పైగా కేసీఆర్ వంటి వారు నేతృత్వం వహిస్తే జాతీయ పార్టీలను ఏకం చెయ్యలేరు అనే కొత్తవాదన తెరపైకి తెస్తున్నారట.

ఇప్పటికే చంద్రబాబు దీనిపై కొంత స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. కేసీఆర్ తో రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని, అంతేకాక, కేసీఆర్ కన్నా చంద్రబాబు సీనియర్ అని ,రెండు రాష్ట్రాల మద్య అనేక వివాదాస్పద అంశాలు ఉన్నందున కేసీఆర్ కు చంద్రబాబుకు మద్దతు ఇవ్వకపోవచ్చని తెలుగు దేశం వర్గాలు తెలిపాయి. అయితే కేసీఆర్ నాయకత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడతారా అనేది చూడాలి.