Who is behind YS jagan Attackప్రతిపక్ష నేత జగన్‌ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జగన్‌ వాంగ్మూలాన్ని ఏపీ సిట్‌ అధికారులు సేకరించారు. వాంగ్మూలం నమోదు అనంతరం డిశ్చార్జి చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఐదురోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీనితో పాదయాత్రను వాయిదా వెయ్యనున్నట్టు సమాచారం.

అనంతరం జగన్‌ లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో కత్తితో దాడి అనంతరం జగన్‌ హైదరాబాద్‌ చేరుకొని చికిత్స కోసం ఈ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. జగన్ ను మొదట చుసిన డాక్టరు ఆయన కు 0.5 సెంటీమీటర్ గాయం అయ్యిందని రిపోర్టు ఇస్తే… సిటీన్యూరో ఆస్పత్రి ఏకంగా 3-5 సెంటీమీటర్ గాయమయ్యిందని రిపోర్టు ఇచ్చారు.

గాయం అయిన వెంటనే నవ్వుతూ అందరికి అభివాదం చేసుకుంటూ వెళ్ళిన జగన్, దాదాపుగా రెండు గంటలు ప్రయాణం చేసి హైదరాబాద్ ఆసుపత్రిలో జాయిన్ కావడం అనుమానాలకు తావిస్తోంది. తమకు కావాల్సిన విధంగా రిపోర్టు తెచ్చుకోవడానికి ఆ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతీ శుక్రవారం కోర్టు హాజరు నుండి మినహాయింపు తెచ్చుకోవడానికి వేసిన డ్రామా అని వారు ఆరోపిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టుకు హాజరు అవ్వలేనని జగన్ పిటిషన్ వేస్తే, తెలంగాణ ప్రభుత్వం తాము కూడా ఆయనకు భద్రత కలిపించలేమని కోర్టులో చెప్పి జగన్ కు సహకరించేందుకు వ్యూహం రచించినట్టు వారు అనుమానిస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి వైకాపాకు గల సత్సంబంధాల వల్ల సిబిఐ కూడా కోర్టులో ఇందుకు సహకరించే అవకాశం ఉంది.