YS Jagan rayalaseemaఏపీకి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో రైతులు చేస్తోన్న పాదయాత్ర ప్రభావం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదేమో! కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానే కదిలించిన ఈ పాదయాత్రలో మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా పాలు పంచుకున్నాయి.

గుంటూరు జిల్లాలో ప్రారంభమైన ఈ పాదయాత్ర దిగ్విజయంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలను దాటి సీమలోకి ప్రవేశించింది. నెల్లూరు జిల్లాలో అయితే ఏకంగా వైసీపీ నేతలే ఈ పాదయాత్రను స్వాగతించి భాగస్వామ్యులు అయిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించడానికి కొందరు యత్నిస్తున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.

అమరావతి రైతులకు భోజనాలు ఏర్పాట్లు చేసిన పొలాలను రాత్రికి రాత్రే దున్నేయడం, అలాగే పాదయాత్ర చేసి కాస్త సేద తీరడానికి ఏర్పాట్లు చేసిన టెంట్లను పీకేయడం వంటివి నిరంతరంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా వినపడుతోన్న పేరు పురుషోత్తంరెడ్డి. సదరు రెడ్డి గారు ఓ మీడియా ఛానల్ పెట్టిన డిబేట్ లో పాల్గొనగా, ఇందులో తమ వెనుక ఎవరు ఉన్నారో స్వయంగా పురుషోత్తం గారే వెల్లడించారు.

అమరావతి రైతుల వెనుక ఉన్నది ఆ పార్టీలైతే, ఎస్… మా వెనకాల కూడా జగన్ ఉన్నాడంటూ స్వయంగా పురుషోత్తం రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమరావతి రైతుల పాదయాత్రకు టిడిపి సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన విషయం బహిరంగమే.

రాయలసీమ ఉద్యమం పేరుతో వేర్పాటు వేదాన్ని సృష్టిస్తోన్న పురుషోత్తంరెడ్డి, తమ వెనుకాల ఉన్నది జగన్ మోహన్ రెడ్డి అని నిజంగా ఒప్పుకున్నారా? లేక టంగ్ స్లిప్ అయ్యారా? ఏది ఏమైనా పురుషోత్తం చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది.