Who cheated praja Rajyam Partyపవన్ కళ్యాణ్ తన తొలివిడత ఆంధ్ర ప్రదేశ్ యాత్ర పూర్తి చేసుకునున్నారు. విజయనగరం నుండి ఒంగోలు దాకా సాగిన ఈ యాత్రలో ఆయన అన్ని జిల్లాలలోని జనసేన కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరిని ఆశ్చర్యపరుస్తూ ఆయన ప్రజారాజ్యం పార్టీని ఆయన సోదరుడు చిరంజీవిని వెనకేసుకొని వచ్చారు.

ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసినవారి సంగతి చూస్తానని పవన్ కళ్యాణ్ అనడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రజారాజ్యం పార్టీకి ఎవరు ద్రోహం చేశారన్నదానిపై ఆయన కు ఎంత మేర స్పష్టత ఉందన్నది అనుమానమే. ఆయన విషయం పక్కన పెడితే ప్రజారాజ్యానికి ఎవరు ద్రోహం చేసారు అన్నది అర్ధం కానీ ప్రశ్న.

ప్రజారాజ్యంలో ఉండి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురికి మద్దతుగా పవన్ కళ్యాణే ప్రచారం చేశారు. అది తప్పు అనుకుంటే చాలా మంది తెలుగు దేశం వారిని ప్రజారాజ్యం జాయిన్ చేసుకోవడం కూడా తప్పే కదా? అయినా అటువంటి వారికి గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా చేసారు. చిరంజీవి కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు.

ప్రజారాజ్యం విలీనం చేయడం ద్రోహమా? లేక కాంగ్రెస్ పార్టీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ద్రోహమా? దానికి నిందించాల్సింది ఎవరైనా ఉంటె అది చిరంజీవినే కదా? పరకాల ప్రభాకర్, కేశినేని నాని వంటి వారు చిరంజీవి మీద విమర్శలు చేసి తరువాత చంద్రబాబు వద్దకు వచ్చారు. వీరిని పవన్ కళ్యాణ్ తరచు టార్గెట్ చెయ్యడం మనం చూస్తూ ఉంటాం.

పార్టీకి అప్పట్లో మద్దత్తు ఇచ్చిన మేధావులు – మిత్ర, సమరం వంటివారు కూడా ప్రజారాజ్యం పట్ల అదే అభిప్రాయంతో ఉన్నారు కదా? దానికి పవన్ కళ్యాణ్ ఎవరిని నిందించాలి? ప్రజారాజ్యంలో ఎన్నో లోటుపాట్లు ఉన్న వాటిని అన్ని చూసీచూడక ఆ నాయకులందరూ చిరంజీవిని సీఎం చెయ్యాల్సిందిని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారా? తన తోడబుట్టినవాడు కాబట్టి పవన్ కళ్యాణ్ భరించి ఉండొచ్చు కానీ మిగతా వారికి ఏమి అవసరం?