ఆ డైరెక్టర్ కు థియేటర్ లో విజిల్స్... అరుపులునవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన జాతిరత్నాలు సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహా శివరాత్రి సందర్భంగా మూడు సినిమాలు విడుదలైతే అన్నిటికంటే బెటర్ టాక్, ఓపెనింగ్స్ వచ్చాయి ఈ సినిమాకు. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ అనుదీప్ ఒక చిన్న గెస్ట్ రోల్ చేశాడు.

అరనిమిషం పాటు కూడా లేని ఆ గెస్ట్ రోల్ కు థియేటర్ లో అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఏదో పెద్ద దర్శకుడిని చూసినంత హంగామా చేశారు. అనుదీప్ కు ఇది రెండో సినిమా… అతని మొదటి సినిమా… పిట్టగోడ 2016లో విడుదలై ప్లాప్ గా మారింది. అయితే ఈ రేంజ్ రెస్పాన్స్ రావడానికి కారణం లేకపోలేదు.

జాతిరత్నాలు సినిమాల ప్రమోషన్స్ కు గానూ.. ఈ చిత్ర బృందం క్యాష్ అనే టీవీ షోకు వెళ్ళింది. ఆ షోలో సైలెంట్ గా కనిపించే అనుదీప్ తన కామెడీ టైమింగ్ తో బాగా పాపులర్ అయిపోయాడు. ఆ క్యాష్ ఎఫక్టే సినిమాలో అనుదీప్ గెస్ట్ రోల్ కు వచ్చిన రెస్పాన్స్ కు కారణం. ఇది ఇలా ఉండగా.. జాతిరత్నాలు ఓపెనింగ్స్ బావున్నాయి.

సినిమా పెద్ద హిట్ గా నిలిచే అవకాశం ఉంది. అనుదీప్ కూడా బిజీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే అతని తదుపరి సినిమా కూడా స్వప్న సినిమా కే చెయ్యబోతున్నాడని ఇప్పటికే చెప్పాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక కామెడీ స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉన్నట్టు ఒక ఇంటర్వ్యూలో విడుదలకు ముందే చెప్పుకొచ్చాడు.