కన్నడ భామ రష్మిక మందన తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించిన వెంటనే వరుసగా హిట్స్ పడటంతో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. సూపర్ డూపర్ హిట్ పుష్పలో అల్లు అర్జున్‌తో పోటీ పడి నటించి రష్మిక అందరి మన్ననలు అందుకొంది. పుష్పతో రష్మిక మరింత ఎత్తుకి ఎదిగిపోయింది.
అయితే చాలామంది హీరోహీరోయిన్లలాగే ఆమె కూడా సరైన కధలు ఎంచుకోలేక అప్పుడప్పుడు తన హిట్ రికార్డుల ఖాతాలో కొన్ని ఫ్లాపులు కూడా జోడించుకొంటోంది. అందుకు తాజా ఉదాహరణగా శర్వానంద్‌తో చేసిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా ఉంది. ఆ సినిమా ఫ్లాప్ అవడం వారిద్దరికీ తీవ్ర నిరాశ కలిగించింది.
ఓ సూపర్ హిట్ తరువాత రష్మిక ఖాతాలో మళ్ళీ ఓ ఫ్లాప్ పడింది కనుక మళ్ళీ మరో హిట్ కోసం ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం ఆమె చేతిలో పుష్ప-2, దుల్ఖర్ సల్మాన్ హీరోగా వస్తున్న సీతారామం, దళపతి 66 సినిమాలున్నాయి. వీటిలో పుష్ప-2 తప్పకుండా హిట్ అవుతుంది కానీ అది విడుదలయ్యేందుకు ఇంకా చాలా సమయం ఉంది. కనుక ఈలోగా రష్మిక ఖాతాలో మరో హిట్ పడుతుందో లేదో చూడాలి.
You’re Good for Only Exposing: Actress Responds
Ratings: ABN Continues To Be Ahead Of Sakshi