what ysr congress done is a human rights violation  Pawan Kalyanప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. చెత్త పన్ను విధింపే ఒక దరిద్రం అనుకుంటే వసూలు చేసే విధానం మరింత దిగజారుడుగా ఉంది. కర్నూలులో వ్యాపారులు ఆ పన్ను చెల్లించలేదని సిటీలోని చెత్త మొత్తం తెచ్చి దుకాణాల ముందు వేసి వ్యాపారులను అవమానిస్తారా? ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రజల ముందుంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ కోశానా కనిపించట్లేదు వైసీపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తుంది? డైలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ ఆలోచనలా ఉంది జగన్ సర్కారు వ్యవహార శైలి అంటూ పవన్ తన సోషల్ మీడియా ఖాతాలో వైసీపీ పాలనా వ్యవస్థపై తనదైన శైలిలో చురకలు వేశారు.

చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఈ వైసీపీదే అంటూ జనసైనికులు., పవన్ అభిమానులు పవన్ చేసిన పోస్ట్ ని వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. చెత్త పన్ను కట్టకపోతే చెత్తను తీసుకువచ్చి సదరు దుకాణదారుడు షాప్ ముందు పడేసిన మీరు మరి ప్రభుత్వంలోకి వచ్చి మూడేళ్లయినా రాజధాని నిర్మాణం ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పాలంటూ నిలదీస్తున్నారు జనసేన నేతలు.

ఇందుకు గాను మరి జగన్ తాడేపల్లి ప్యాలస్ ముందు రాజధాని ప్రాంత ప్రజల చెత్తవేయలేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు జనసేన సోషల్ మీడియా విభాగం. రాజుకో న్యాయం ప్రజలకో న్యాయమా మీరే చెప్పాలి అంటూ తిరిగి జగన్ గారినే ప్రశ్నిస్తున్నారు ప్రజానీకం.