what Narendra Modi thinking about war with pakistanపాకిస్థాన్ పై భారత వాయుసేన చేసిన దాడుల వల్ల బీజేపీకి బాగాకలిసి వస్తుందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కర్ణాటకలో 22 సీట్లు గెలుస్తుందని చెప్పుకొచ్చారు ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి ఏడ్డ్యూరప్ప. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల కోసమే దాడులు చేస్తున్నారని పాకిస్తాన్ మీడియా కూడా ఎడ్డీ మాటలను ఉటంకిస్తూ విమర్శలు చేస్తుంది. అయితే ఎడ్డీ ఆలోచనా సరళికి ప్రధాన మంత్రి మోడీ ఆలోచనకు పెద్దగా తేడా ఉన్నట్టుగా కనిపించడం లేదు.

పాకిస్తాన్ తో యుద్దమంటూ వస్తే ఎన్నికలు ఆరునెలలు లేదా అంతకంటే ఎక్కువ వాయిదా పడే అవకాశం ఉంది. దీనితో బీజేపీకి ఎంత మైలేజ్ వస్తుంది అనేది స్పష్టంగా తెలియదు. కావున యుద్దానికి వెళ్లకుండా ఇప్పుడే ఎన్నికలు జరిపిస్తే పార్టీకి ప్రజలలో ఎక్కువ మైలేజ్ వస్తుందని మోడీ – అమిత్ షా అభిప్రాయపడుతున్నారట. ఇందు మూలంగానే మోడీ ఇంతటి విపత్కర పరిస్థితులలో కూడా తన ఎన్నికల ప్రచారం మానకుండా చేసుకుంటున్నారు. కోడ్ అమలు లోకి రాకముందే వీలైనన్ని చోట్లకు తిరగాలని మోడీ భావిస్తున్నారట.

యధాతధంగా మర్చి మొదటి వారంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు భారత పైలట్ అభినందన్ ను విడుదల చేయాల్సిందిగా అమెరికా పాకిస్తాన్ మీద ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ కూడా యుద్ధం నివారించేందుకు ఆయనను విడుదల చెయ్యడమే మేలు అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సాయంత్రం ఐదుగంటలకు త్రివిధ దళాలు నేటి సాయంత్రం సంయుక్తంగా మీడియాతో సమావేశం నిర్వహించనున్నాయి. ఈ సమావేశంలో కశ్మీర్‌లోని పరిస్థితులకు సంబంధించి కొన్ని కీలక వివరాలను వెల్లడించనున్నారు.