what is happening at Thanneru Harish Rao houseదేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు తెస్తా అంటూ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ క్రియాశీల పాత్ర పోషించాలన్న ఆలోచనతో తన కుమారుడు కేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేసే క్రమంలో ఇది మొదటి అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి పార్టీలో లేదు. ఈ నియామకంతో తెరాసలో నూతన అధ్యాయానికి కేసీఆర్‌ తెరదీశారు. ఈ నియామకం పార్టీ కోసం అహర్నిశలు పాటు పడిన హరీష్ రావుకు ఇది అన్యాయమే అని విస్తృత అభిప్రాయం.

అయితే కేటీఆర్ ను తన వారసుడిగా నిర్ణయించేసుకునున్నారు ఈ క్రమంలో హరీష్ కూడా కేటీఆర్ కు సహకరిస్తా అని ప్రకటించారు. అయితే కుటుంబకలహాల ఎప్పటికైనా పార్టీకి చేటే అని కేసీఆర్ భావిస్తున్నారు. నిన్నటి నుండి వందలాది వాహనాల్లో వేలాదిగా అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఆయన నివాసానికి తరలిరావడంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్లు కిక్కిరిసాయి. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ జామ్‌ అయ్యాయి. అయితే టీఆర్‌ఎస్ తొలి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నియమితులైన నేపథ్యంలో హరీష్‌ అభిమానులు వేలాదిగా తరలిరావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

పైకి మాత్రం తెలంగాణ ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించిన ఈ టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌కు అభినందనలు తెలిపేందుకు ఆయన అభిమానగణం తరలివచ్చిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ తలపోటు ను పూర్తిగా సరి చెయ్యాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీనికోసం వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో హరీష్ ను మెదక్ పార్లమెంట్ కు పోటీ చేయించి టోటల్ గా రాష్ట్ర రాజకీయాలకు దూరం చెయ్యాలని కేసీఆర్ యోచిస్తున్నారట. కేంద్రంలో 2019 తరువాత వచ్చే ప్రభుత్వంలో తెరాస కీలక పాత్ర పోషిస్తుందని హరీష్ కు కేంద్రంలో పెద్ద మంత్రి పదవి ఇప్పిస్తా అని కేసీఆర్ చెప్పవచ్చు.

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని ఓడించడంలో.. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో భారీ మెజార్టీతో గెలవడంలో కీలక పాత్రపోషించారు. టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌గా వ్యూహాలు రచించడంలో తాను దిట్టా అని మరోసారి నిరూపించుకున్నారు. ఈ క్రమంలో ఆయన సేవలు జాతీయ రాజకీయాలలో కూడా అవసరమని చెప్పి కేసీఆర్ ఆయనను ఢిల్లీకి తీసుకెళ్ళే అవకాశం ఉందట. ఈ క్రమంలో హరీష్ ఇంటికి తరలి వస్తున్న నాయకులు అభిమానులు కొంత అనుమానం కలిగిస్తుంది.