What could be more shameful than this modi and jaganపది రోజులకు పైగా ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ అమలు అవుతున్నా కరోనా కేసులు కంట్రోల్ కావడం లేదు. రోజుకు ఇరవై వేలకు పైగా కేసులు, 100కు పైగా చావులు సర్వసాధారణం అయిపోయింది. మరోవైపు… కరోనా కంట్రోల్ విషయంలో అలాగే మెరుగైన వైద్య సదుపాయాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

అది నిజమే అన్నట్టుగా తమ జిల్లాల లో ఆక్సిజన్ ప్లాంట్లు స్థాపించాల్సిందిగా నెల్లూరు, కర్నూల్ జిల్లాల కలెక్టర్లు నటుడు సోను సూద్ కు ఒక లేఖ రాశారు. ఆయన కూడా అందుకు సానుకూలంగా స్పందించారు. జూన్ నెలలో పని పూర్తి అవుతుందని సోను సూద్ ప్రకటించారు. ప్రభుత్వానికి అభ్యర్ధన పెట్టాల్సిన కలెక్టర్లు సహాయం కోసం ఒక నటుడిని అభ్యర్ధించడమంటే ప్రభుత్వం విఫలమైనట్టే కదా?

జగన్ ప్రభుత్వం సంగతి ఇలా ఉంటే…. మోడీ ప్రభుత్వం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఫస్ట్ వేవ్ లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తే సెకండ్ వేవ్ ని అంచనా వెయ్యడంలో పూర్తిగా విఫలమై మొదటి సారిగా ప్రభుత్వం పూర్తిగా విమర్శలు ఎదురుకుంటుంది. తాజాగా జైసల్మేర్ లోని ఒక బెటాలియన్ కు చెందిన ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ ఇటువంటి లేఖే సోను కు రాశారు.

తమకు ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఎక్స్ రే మెషిన్, ఒక జనరేటర్ కావాలని మోర పెట్టుకున్నారు. దేశాన్ని కాపాడుతున్న ఆర్మీకి సంబంధించిన అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చలేకపోతే దేశం ఎటుపోతున్నట్టు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అధికారులు, ఆర్మీ తమ అవసరాల కోసం ప్రభుత్వాలను వదిలి ఒక నటుడి వైపు చూస్తుంటే జగన్ కు, మోడీకు ఇంతకంటే అవమానం ఉంటుందా?