Wedding bells for actress Bhavanaఅవకాశాలు తగ్గుతున్న కొద్దీ హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం అనేది సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరిగే విషయం. ఆ క్రమంలోనే మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోందని లేటెస్ట్ న్యూస్. ‘ఒంటరి, మహాత్మ’ సినిమాల ద్వారా తెలుగు తెరపై సందడి చేసిన హీరోయిన్ భావన, మాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. ఇప్పటికీ చేతిలో కొన్ని సినిమాలు ఉన్నా గానీ, పెళ్లి చేసుకునేందుకు భావన రెడీ అవుతుండడం చెప్పుకోదగ్గ విశేషం.

దీనికి కారణం ప్రేమలో పడటమేనని తెలుస్తోంది. ఓ నిర్మాతతో ప్రేమలో ఉన్న భావన, త్వరలోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటోందని ట్రేడ్ టాక్. పెళ్ళయిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగేందుకే ఈ ముద్దుగుమ్మ మొగ్గుచూపుతోందని సినీ వర్గాలు చెప్తున్నా, పెళ్ళయిన తర్వాత అవకాశాలు రావన్న విషయం తెలిసిందే. బహుశా తను ఎంతగానో ప్రేమించి, పెళ్లిచేసుకున్న నిర్మాతే సినిమాలు తీయాలేమో అన్న సెటైర్లు కూడా సినీ జనాల్లో వినపడుతున్నాయి. మరి అధికారిక సమాచారం ఎప్పుడు ఇస్తుందో చూడాలి.