we always want and need chandrababu naidu2014లో రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో చంద్రబాబు ప్రభావం తగ్గుతూ వస్తుంది. హైదరాబాద్ నుండి అమరావతి వచ్చాకా ఆయన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే దృష్టిపెట్టారు. అయితే 2018 ఎన్నికల సమయంలో మాత్రం ఆశపడి తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టి కాల్చుకున్నారు.

అది వేలుతో సరిపోలేదు… ఆ తరువాత కేసీఆర్ జగన్ కు ఎన్నికలలో సాయమందించి చంద్రబాబును సీఎం పదవికి దూరం చేశారు. అయితే 2018లో కేసీఆర్ కు వార్ వన్ సైడ్ అవ్వడానికి అనుకోకుండా చంద్రబాబే కారణం అయ్యారు. చంద్రబాబు హైదరాబాద్ వచ్చి ప్రచారం మొదలుపెట్టగానే మళ్ళీ ఆంధ్రోళ్ళ పాలన కావాల్నా అంటూ కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొట్టారు.

సరిగ్గా మూడేళ్ళ తరువాత తెరాస కు మళ్ళీ చంద్రబాబు అవసరం వచ్చింది. ఈ సారి అసలు చంద్రబాబు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడకపోయినా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు బినామీ అంటూ ప్రచారం మొదలుపెట్టారు.

ఇప్పటికే బీజేపీ సెగ తో ఇబ్బంది పడుతున్న అధికార పార్టీకి రేవంత్ రెడ్డి దూకుడు తలపోటుగా మారింది. అయితే చంద్రబాబు సెంటిమెంట్ 2018 తోనే ఎక్స్పైర్ అయిపోయింది అని చాలా మంది అభిప్రాయం. చంద్రబాబు తెలంగాణ గురించి మాట్లాడనంత వరకు ఆయన పేరు చెప్పుకుని ఓట్లు దండుకునే ప్రయత్నాలు ఫలించవనే అంటున్నారు వారు.

తెరాస సర్కారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు మంత్రం పాటిస్తూ ఉంటుంది. తాజాగా స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారంటే ఎందుకనో భయపడుతున్నారు అనే అనుకోవాలి.