wasim jaffer counter to england cricketer michael vaugham నిత్యం ఇండియన్ క్రికెట్ మీద, ఇండియన్ క్రికెటర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇంగ్లాండ్ క్రికెట్ ప్లేయర్ మైఖేల్ వాన్ కు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఇండియా మ్యాచ్ లు జరిగిన సందర్భంలో సోషల్ మీడియాలో ఏవో అనుచిత వ్యాఖ్యలు చేసి మన క్రికెటర్ల చేత, అలాగే నెటిజన్ల చేత విమర్శలు పాలు కావడం మైఖేల్ వాన్ కు అలవాటైపోయిన పని.

ఇంగ్లాండ్ కెప్టెన్ గా వ్యవహరించినపుడు ఎంత హుందాగా ఉండేవారో, రిటైర్ అయిపోయిన తర్వాత అంత రచ్చగా తయారయ్యారు. ట్విట్టర్ వేదికగా మైఖేల్ వాన్ చేసే ట్వీట్స్ కు దిమ్మతిరిగే విధంగా బదులివ్వడం ఇండియన్ ఓపెనర్ వసీం జాఫర్ వంతు. ఆ క్రమంలోనే తాజాగా కూడా ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వసీం జాఫర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ… ‘నా మొదటి టెస్ట్ వికెట్’ అంటూ వసీంను ట్యాగ్ చేసాడు వాన్. దీనికి మన ముంబై క్రికెటర్ జాఫర్ కూడా ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్ ఇచ్చాడు. “థాంక్యూ మై పర్మినెంట్ సోషల్ మీడియా వికెట్” అంటూ చేసిన ట్వీట్ కు నెటిజన్ల నుండి భారీ స్పందన లభిస్తోంది.

ఇలాంటి కౌంటర్లు వాన్ కు కొత్తేమీ కాదు, అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఇండియన్ క్రికెటర్ల చేత గానీ, నెటిజన్ల చేత గానీ అనిపించుకోకుండా ట్వీట్స్ చేయరు. బహుశా దీనిని పబ్లిసిటీ అనుకుని భావిస్తున్నారో ఏమో గానీ, నెటిజన్లు మాత్రం మైఖేల్ వాన్ ప్రవర్తనను చాలా చీప్ గా పరిగణిస్తున్నారు. ఆయన చేసే కామెంట్స్ అలానే ఉంటాయి మరి!