Vundavalli Aruna Kumar comments on ys jaganరోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో మహారాజు ఫిడెల్ వాయిస్తూ కూర్చున్నాడట. చరిత్ర లో జరిగిన ఆ విషయం ఇప్పటికీ చెప్పుకుంటారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కూడా ఇటువంటి అపవాదే వచ్చింది. ప్రపంచమంతా కరోనా వైరస్ భయంతో వణికిపోతుంటే సీఎం జగన్ స్థానిక ఎన్నికలు వాయిదా వెయ్యకూడదని కోర్టులకు వెళ్లారు.

ఏకంగా ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద కులపరమైన విమర్శలు చేశారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా జగన్ మా రాజశేఖరరెడ్డి కొడుకు అని చెప్పుకునే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా జగన్ మీద విరుచుకుపడ్డారు.

“ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నాకు ఏ మాత్రం సంతృప్తికరమగా లేవు. చిన్నప్పటి నుండీ రాజకీయాలలో ఉన్న నాకు అసలు ఇది నచ్చలేదు. జగన్ వైఖరి చాలా తప్పు. నాయకుడిగా జగన్ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. రమేష్ కుమార్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు,” అని ఉండవల్లి చెప్పుకొచ్చారు.

“ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడాల్సిన పద్ధతి అయితే అది కాదు. కులం అనేది ఎప్పుడూ ఉంది. కులం లేకుండా రాజకీయం లేదు. అయితే ఇంత విచ్చలవిడిగా బట్టలు విప్పేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత బహిరంగంగా కులకారణంగా ఎన్నికలు వాయిదా వేశారని విమర్శించడం చాలా తప్పు,” అని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఉండవల్లి వంటి వారు కూడా తప్పు పడుతున్నారంటే జగన్ ఆలోచించుకోవాల్సిందే