VT10 Movie Producer Sidhu Mudda relative to Varun Tejసినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్న ఈ యంగ్ హీరో బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. కొత్త కుర్రాడు కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా కోసం అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు వరుణ్ తేజ్.

ఆ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే విశాఖపట్నంలో పూర్తి అయ్యింది. రెండో షెడ్యూల్ మొదలయ్యే లోపు కరోనా వైరస్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తుంది. ఈ సినిమాకు ఒక ప్రొడ్యూసర్ సిద్దు ముద్ద వరుణ్ తేజ్ కు దగ్గర బంధువట. అసలైతే ఈ సినిమాకు డబ్బంతా వరుణ్ పెడుతున్నాడట పేరు మాత్రం సిద్దుది.

అలాగే రాజ్ తరుణ్ తో సినిమా ఒకటి సిద్దు నిర్మించబోతున్నాడు. ఆ సినిమాకు కూడా పెట్టుబడి వరుణ్ ది పేరు సిద్దుది. రాజ్ తరుణ్ ప్రస్తుతం ఉన్న ఫామ్ కు అతనితో సినిమా అంటే సాహసం అనే చెప్పుకోవాలి. యాక్టింగ్ కేరీర్ తో బిజీగా ఉండటంతో కేవలం పెట్టుబడి వరకే వరుణ్ తేజ్ పరిమితం అయ్యాడంటున్నారు.

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే రామ్ చరణ్ నిర్మాణ రంగంలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా వరుణ్ తేజ్ బాక్సింగ్ సినిమాను జులై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఇదే రోజున విడుదలకు ప్లాన్ చేశారు. అయితే ఆ సినిమా ఆ తరువాత వాయిదా పడింది.