No Elections in Andhra Pradesh Even If Supreme Court Allows?రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికలకు గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ గెలుపు కోసం వాలంటీర్లు రంగంలోకి దిగి, ఓటర్లను బెదిరిస్తున్నారని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇందుకు ఆధారంగా ఒక ఫోన్ రికార్డింగ్ కూడా విడుదల చేసింది.

గుంటూరు జిల్లా, కారుమంచి గ్రామంలో బిసి ఓటర్ల ఇళ్ళకు వెళ్లి పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకపోతే పింఛన్లు తీసేస్తామని బెదిరించమని వైసీపీ నేతలు వాలంటీర్లకు పురమాయించారని… రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందని…. ప్రజాధనంతో జీతాలిస్తూ వాలంటీర్లతో జగన్ రెడ్డి చేయిస్తున్న పని ఇది అంటూ టీడీపీ ట్విట్టర్ లో విమర్శలు చేసింది.

ఆ ఆడియో లో తాను పై అధికారులు చెబుతున్నట్టుగానే వైఎస్సార్ కాంగ్రెస్ కి ఓటు వేయకపోతే పింఛన్లు తీసేస్తామని చెప్పానని, అందులో తప్పు ఏముందన్నట్టుగా సదరు వాలంటీర్ మురళి మాట్లాడటం విశేషం. మరో వైపు… నిన్న పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఒక టీడీపీ అభ్యర్థిని విత్ డ్రా చేసుకోమని బెదిరిస్తున్న ఫోన్ రికార్డింగ్ ని కూడా టీడీపీ రిలీజ్ చేసింది.

విత్ డ్రా చేసుకోకపోతే ఏం జరుగుతుందో చూసుకో అంటూ బహిరంగంగానే బెదిరిస్తున్నాడు ఆ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఆడియోలో. ఇక పల్నాడు ప్రాంతంలో ఇటువంటి బెదిరింపులు మరింత దారుణంగా ఉన్నాయని ఈనాడు ప్రత్యేక కథనం ప్రచురించింది.