vladimir-putin-third-world-warవిదేశాల్లో ఉన్న రష్యా పౌరులందరూ స్వదేశానికి వచ్చేయాలని, మూడవ ప్రపంచ యుద్ధం ఏ క్షణమైనా ప్రారంభం కావచ్చని, సాధ్యమైనంత త్వరగా రష్యన్లు వెనుదిరగాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. ఈ విషయాన్ని రష్యాలో ప్రముఖ పత్రిక ‘ది సన్’ ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయని, కొత్త ప్రపంచ యుద్ధం ఆరంభం కానుందని పుతిన్ వ్యాఖ్యానించినట్టు సదరు పత్రిక తెలిపింది.

యుద్ధం వస్తే, అణ్వాయుధాల ప్రయోగం తప్పదని భావిస్తూ, దాదాపు 4 కోట్ల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అతిపెద్ద ఢిఫెన్స్ డ్రిల్ నిర్వహించిన అనంతరం పుతిన్ నోటి వెంట ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. వివిధ దేశాల్లోని అందరూ అధికారులు, వారి భార్యా బిడ్డలు, బంధువులతో సహా మాతృదేశానికి వచ్చేయాలని పుతిన్ ఉన్నతస్థాయి హెచ్చరికలు జారీ చేసినట్టు ‘ది సన్’ వెల్లడించింది.

ఇప్పటికే ఫ్రాన్స్ పర్యటనను రద్దు చేసుకున్న పుతిన్ స్వయంగా, స్వదేశానికి వచ్చేందుకు నిరాకరించే వారు, భవిష్యత్తులో ఉద్యోగార్హత కోల్పోతారని హెచ్చరించినట్టు తెలుస్తోంది. రష్యా పౌరులకు ఇంత అకస్మాత్తుగా ఈ తరహా ఆదేశాలు ఎందుకు జారీ చేశారన్న విషయమై స్పష్టత లేనప్పటికీ, యుద్ధ అనుమానాలతోనే పుతిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసుండవచ్చని రష్యా నిపుణులు అంటున్నారు.