Vizag ysrcp leader Vamsi Krishna Srinivasవైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది… ఈ నెల 12న తమ ముందుకు డీజీపీ వచ్చి సంజాయిషీ చెప్పాలని ఆదేశించింది. అయితే కోర్టు కేసులు, కోర్టు వ్యాఖ్యలు అధికార పార్టీ నేతల మీద ఎటువంటి ప్రభావం చూపించినట్టుగా లేదు.

వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్‌ సీపీ మీనాను కలిశారు. ఎయిర్‌పోర్టులో చంద్రబాబును ప్రజా సంఘాలు, ప్రజలే అడ్డుకుని ఆందోళన చేశారని తెలియజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… జై అమరావతి అంటూ టీడీపీ నాయకులు నినాదాలు చేసి రెచ్చగొట్టడం వల్లే చంద్రబాబును ప్రజలు అడ్డుకున్నారన్నారు

అంతవరకూ బానే ఉంది… చంద్రబాబు విశాఖకు మళ్లీ వచ్చినా అడ్డుకుంటామని ఆయన తెలిపారు. ఇది కేవలం వ్యవస్థల పట్ల ఎటువంటి గౌరవం లేకపోవడమే అని స్పష్టంగా తెలుస్తుంది అని పలువురు ఆక్షేపిస్తున్నారు. దారుణమైన విషయం ఏమిటంటే… సదరు నేత విశాఖపట్నం సీపీ మీనాను కలిసి ఆయన ఆఫీసు బయటే మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడం.

ఇది ఇలా ఉండగా… ఈ మధ్య కాలంలో డీజీపీని హైకోర్టుకి రప్పించడం ఇది అప్పుడే రెండో సారి. సహజంగా ఇటువంటి పరిణామాలు ఆ స్థాయిలో ఉన్న అధికారులు చాలా నామోషీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు గౌతమ్ సవాంగ్ పరిస్థితి కూడా అంతే. పోలీసులు అధికారంలో ఉన్న వారి ఒత్తిడికి తలొగ్గినంత కాలం ఇటువంటివి తప్పవేమో!