vivek oberoi ram charan conbination failed in Vinaya Vidheya Rramaటాలీవుడ్ లో టాప్ దర్శకుల్లో బోయ పాటి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బోయపాటి ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో ఒక్క దమ్ము మినహా మిగిలిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

అయితే బోయపాటి సినిమాల్లో విలన్ కి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. లెజెండ్ లో జగపతి తీసుకున్నా సరైనోడులో ఆది పినిశెట్టిని తీసుకున్నా ఆ సినిమాల్లో హీరోకి ధీటుగా ఉన్నాయి ఆ పాత్రలు కానీ వినయ విధేయ రామలో బోయపాటి విలన్ గా ‘వివేక్ ఒబెరాయ్’ ట్రై చేసాడు. కట్ చేస్తే ఆ పాత్ర హీరోకి తగ్గట్టుగా మలచడంలో…హీరోని ఢీ కొట్టే బలమైన పాత్రగా రూపు దిద్దడంలో బోయపాటి ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి.

ఇంకా చెప్పాలి అంటే జయ జానకీ నాయకలో తరుణ్ అరోరా పాత్ర కూడా బలమైన పాత్రగా కనిపిస్తుంది..ఇక జగపతి బాబు పాత్ర నెగెటివ్ షేడ్స్ తీసుకున్నప్పటి నుంచి బలమైన పాత్రగానే మంచి అట్టెన్షన్ తీసుకుంది.

కానీ వినయ విధేయ రామలో మాత్రం వివేక్ ఒబెరాయ్ తేలిపోయాడు. మరో పక్క తెలుగులో వివేక్ ఒబెరాయ్ విలన్ గా మొదటి సినిమా కావడంతో, హిందీలో హృతిక్ రోషన్ సినిమా ‘క్రిష్’, తమిళంలో ‘వివేగం’లో లాగా మంచి పేరు తెచ్చి పెడుతుంది ఈ పాత్ర అని అనుకున్నారు అందరూ కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది. విలన్ పాత్రే సినిమాకు మైనస్ అయ్యింది.