Vivegam breaks baahubali 2 recordsఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో “బాహుబలి” సినిమా ఓ ‘బెంచ్ మార్క్’ను సెట్ చేసిన విషయం తెలిసిందే. రికార్డులు కొట్టడం అంటే అది ‘బాహుబలి’ని అధిగమించడమే అన్న రీతిగా మారిన తరుణంలో… కోలీవుడ్ లో తాజాగా ఈ సినిమా రికార్డులను అజిత్ “వివేగం” సినిమా బద్దలు కొట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 3000 థియేటర్స్ లో విడుదలైన ‘వివేగం’ సినిమా తొలి రోజున 33 కోట్ల 8 లక్షల రూపాయలను రాబట్టి, అజిత్ కున్న క్రేజ్ ఏమిటో చెప్పకనే చెప్పింది.

భారీ పాజిటివ్ టాక్ లభించకపోయినప్పటికీ, చెన్నైలో రెండవ వారంలోనూ ఈ సినిమా మంచి వసూళ్ళనే సాధించడంతో, ‘బాహుబలి’ రికార్డులు కాక తప్పలేదు. రెండవ వారంలో 8 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి, ‘బాహుబలి’ రికార్డును అధిగమించి, ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక 100 కోట్లను రాబట్టడం కష్ట సాధ్యంగా మారిన పరిస్థితుల్లోనూ… డివైడ్ టాక్ వినిపించిన నేపధ్యంలోనూ… అజిత్ “వివేగం” 100 కోట్ల క్లబ్ లోకి చేరడం ట్రేడ్ పండితులను కూడా అవాక్కు చేసింది.